రాజీవ్​ యువ  వికాస్​ స్కీమ్​ వర్తింప జేయాలి :  రెడ్డి సంఘాల ఐక్య వేదిక 

రాజీవ్​ యువ  వికాస్​ స్కీమ్​ వర్తింప జేయాలి :  రెడ్డి సంఘాల ఐక్య వేదిక 

కామారెడ్డి​టౌన్, వెలుగు : అగ్ర వర్ణ పేదలకు రాజీవ్​ యువ వికాస్​  స్కీమ్​ వర్తింప జేయాలని కోరుతూ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి అడిషనల్ కలెక్టర్​ వి.విక్టర్​కు వినతి పత్రం అందించారు. అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారన్నారు.   ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అగ్రవర్ణ పేద కుటుంబాలకు వర్తింప జేయాలన్నారు.  

రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ నల్లవెల్లి కరుణాకర్​రెడ్డి,  కోర్​ కమిటీ ఛైర్మన్​  నాగిర్తి చంద్రారెడ్డి, ప్రతినిధులు  రాజారెడ్డి,  మోహన్​రెడ్డి, నర్సారెడ్డి,  రవీందర్​రెడ్డి, సతీష్​రెడ్డి,  సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.