ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. శ్రీశైలం దేవస్థానం ఛైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు చక్రపాణి రెడ్డి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చక్రపాణి రెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరటం శ్రీశైలం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి.
వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదని భావించిన చక్రపాణి రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబును కలిసి పార్టీలో కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు చక్రపాణిరెడ్డి.