తల్లాడ, వెలుగు : మండల పరిధిలోని రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి జూనియర్ కాలేజ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుక్రవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలేజ్ ప్రిన్సిపాల్ ఫాదర్ కొరివి థామస్ అధ్యక్షతన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పీఠాధిపతి బిషప్ ప్రకాశ్సగిలి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న కాలేజీల్లో తమ పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు.
అన్ని వర్గాల స్టూడెంట్స్ తమ కాలేజీల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్స్ గోవ సవరయ్య, అమృత రాజు, శ్రీకాంత్, అమల్, ఫ్రాన్సిస్, అజయ్, సిస్టర్ నిర్మల, సుధాకర్, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.