రెడింగ్టన్​ షోరూముల్లో ఐఫోన్​16 ఫోన్లు

రెడింగ్టన్​ షోరూముల్లో ఐఫోన్​16 ఫోన్లు

హైదరాబాద్​, వెలుగు: ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ రెడింగ్టన్ లిమిటెడ్ తన ఐఫోన్ 16 స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను దేశవ్యాప్తంగా ఏడు వేల రిటైల్ స్టోర్లలో అందించనున్నట్లు  తెలిపింది. అమెరికాకు చెందిన ఆపిల్​  ఇటీవలే 16 సిరీస్​ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆవిష్కరించింది. ఫోన్లతోపాటు ఆపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా 2, ఎయిర్ పాడ్స్ 4లను కూడా అమ్ముతామని తెలిపింది. అన్ని కొత్త మోడళ్లను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు. 

డెలివరీలు సెప్టెంబర్ 20, ఉదయం 8 గంటల నుంచి మొదలవుతాయి. ఈ ప్రొడక్టులపై పలు ఆఫర్లు ఉన్నాయని, కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే డిస్కౌంట్లు వస్తాయని రెడింగ్టన్​ తెలిపింది.