ప్రముఖ షావోమీ ఇండియా బడ్జెట్ ఫ్రెండ్లీ రెడ్‌మి 13 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్.. 108 మెగా పిక్స ల్ మెయిన్ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్, క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌ని కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫోన్ ప్రీమియం అనుభూతి కస్టమర్లు పొందు తారు.గతేడాది విడుదలైన రెడ్‌మి 12 5G ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా ఇది మార్కెట్ లోకి వచ్చింది. రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్‌లు , ధర ఇత ర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
రెడ్‌మి వెల్లడించిన వివరాల ప్రకారం.. రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రీఫ్రెష్ రేట్ తో అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ హ్యాండ్ సెట్ పం చ్ హోల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
5030mAh బ్యాటరీ :
రెడ్‌మి 13 5G స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, HyperOS తో పనిచేస్తుంది. కస్టమర్లకు ఎక్స్ పీరీయెన్స్ అందిస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీతో అద్బుతమైన బ్యాటరీ బ్యాకప్ ను ఇస్తుంది.
Redmi 13 5G భారత మార్కెట్ ధర
కొత్త Redmi 13 రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. బేస్ మోడల్ 6GB RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 12,999 (రూ. 1,000 బ్యాంక్ ఆఫర్‌తో సహా). 8GB RAM , 128GB స్టోరేజ్ కలిగిన రెండవ వేరియంట్ బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ తో కలిపి ధర రూ. 14,499 గా ఉంది.
Redmi 13 5G స్పెసిఫికేషన్స్ :
డిస్‌ప్లే: Redmi 13 5G క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 6.6-ఇంచ్ పంచ్-హోల్ ఫ్లాట్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంటాయి.
ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్ Highest clock స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.
కెమెరా: Redmi 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ , 108 MP మెయిన్ కెమెరా, 2MPసెకండరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక LEDఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13 MPఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Redmi 13 5G పవర్ బ్యాకప్ కోసం 5030 mAhబ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ , డ్యూయల్ SIM, 5G, 4G, బ్లూటూత్, WiFi వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.