కొత్త ఫోన్:10 వేలకే Redmi 14C 5G ఫోన్..ఫీచర్స్ పిచ్చెక్కిస్తున్నాయ్..!

కొత్త ఫోన్:10 వేలకే Redmi 14C 5G ఫోన్..ఫీచర్స్ పిచ్చెక్కిస్తున్నాయ్..!

2025లో మొదటగా రిలీజ్ అవుతున్న ఫోన్ ఇదే.. రెడ్ మీ 14సీ.. 5జీ ఫోన్. స్టార్టింగ్ ధర ఎంతో తెలుసా.. రూపాయి తక్కువ 10 వేల రూపాయలు మాత్రమే. జనవరి 10వ తేదీ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఇక ఫ్యూచర్స్ విషయానికి వస్తే పిచ్చెక్కిస్తున్నాయ్ అంటున్నారు టెక్ నిపుణులు. 10 వేల రూపాయలకే ఇన్ని ఫ్యూచర్స్ తో ఫోన్ అంటే..ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు.

Redmi 14C 5G ధర

Redmi 14C 5G .. స్మార్ట్ ఫోన్ జనవరి 10, 2025 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఇండియాలో 4GB+64GB, 4GB+128GB , 6GB+128GB మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4GB+64GB,వేరియంట్ ధర రూ.9వేల 999.. 4GB+128GB కన్ ఫిగరేషన్ ధర రూ.10వేల999.. 6GB+128GB వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. 

Redmi 14C 5G డివైజ్ మూడు రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. స్టార్ లైట్ బ్లూ, స్టార్ డస్ట్ పర్పుల్,స్టార్ గేజ్ బ్లాక్ రంగుల్లో అమెజాన్ Mi.com, Flipkart,Xiaomi  రిటైల్ స్టోర్లలో జనవరి 10 మధ్యాహ్నం నుంచి అమ్మకాలు మొదలవుతాయి. 

Redmi 14C 5G స్పెసిఫికేషన్లు

Redmi 14C 5G 6.88-అంగుళాల HD+ డాట్ డ్రాప్ డిస్‌ప్లేతో 600నిట్స్ గరిష్ట బైట్ నెస్ తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 5G ప్రాసెసర్‌తో పాటు 6GB వరకు RAM , 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్‌తో 1TB వరకు విస్తరించవచ్చు.

Also Read:-తగలబడుతున్న లాస్ ఏంజెల్స్.. మంటల్లో కాలి బూడిదయిన ధనికుల ఇళ్లు, కార్లు

కెమెరా విషయానికొస్తే.. ఈ డివైజ్ లో 50MP AI ప్రైమరీ సెన్సార్‌తో బ్యాక్ ప్యానెల్ లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఫ్రంట్ లో 8MP సెన్సార్ తో బెస్ట్ సెల్ఫీలు తీసుకోవచ్చు. 

వైజ్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5160mAh బ్యాటరీని ప్యాక్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 14-ఆధారిత HyperOSలో రన్ అవుతుంది. Xiaomi స్మార్ట్‌ఫోన్‌తో 2 సంవత్సరాల Android అప్డేట్ తో 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ 5G సిమ్‌లకు సపోర్ట్‌తో వస్తుంది.