మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది..2024 కి వీడ్కోలు చెప్పి కొత్త ఏడాది 2025 కి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్దమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో కొత్త సంవత్సరంలో కొత్తగా కనిపించేందుకు చాలామంది ప్రయత్నం చేస్తుంటారు..కొత్త కొత్త సెల్ ఫోన్లు కొనాలకుంటారు.. అలాంటి వారికోసం ప్రముఖ సెల్ ఫోన్ తయారీ కంపెనీ Xiaomi తన కస్టమర్లకోసం 2025 కొత్త డివైజ్ ను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసింది..2025 ప్రారం భంలో రిలీజ్ కాబోతున్న Redme 14 C స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, అవైబులిటీ గురించి తెలుసుకుందాం..
Xiaomi తన కస్టమర్ల కోసం కొత్త సంవత్సరం 2025 ప్రారంభంలో Redmi 14C స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయనుంది. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసింది.
Redmi లాంచ్, డిజైన్ డిటెయిల్స్..
Xiaomi ఇటీవల Redme 13C ని ప్రారంభించింది. ఆతర్వాత 2025జనవరిలో Redmi 14C ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో డిజైన్ అద్భుతంగా ఉంది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ప్రీమియం లుక్ తో డిజైన్ అదిరిపోయింది. వృత్తాకార కెమెరా మాడ్యూల్ మల్టిపుల్ సెన్సార్లను కలిగి ఉంటుంది.Xiaomi ద్వారా టీజ్ చేయబడిన లేటెస్ట్ బ్లూ కలర్ వేరియంట్ అద్భుతమైన విజువల్ అప్పీల్‌ని జోడిస్తుంది.
ALSO READ : హోండా యూనికార్న్ కొత్త వెర్షన్ ఇదే
Redmi 14C స్పెసిఫికేషన్లు
Redmi 14C ఇటీవల ప్రారంభించబడిన Redmi 14R రీబ్రాండెడ్ వెర్షన్ లా అనిపిస్తుంది.
ప్రాసెసర్: అద్భుతమైన పనితీరు కోసం Snapdragon 4 Gen 2 SoC
డిస్ ప్లే:120Hz రిఫ్రెష్ రేట్, 600nits బ్రైట్ నెస్, 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్ తో డిస్ ప్లే
బ్యాటరీ:18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీ
కెమెరాలు:13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
ధర, లభ్యత
Redmi 14C భారతదేశంలో రూ.15,000 కంటే తక్కువ ధరలో ఉంటుందని భావిస్తున్నారు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్ ఎక్కువ ఫీచర్లు, బెనిఫిట్స్ పొందాలనుకునే వారికి మంచి ఎంపిక కావచ్చు.