
రెడ్‌మీ నోట్ 13 5జీ, నోట్ 13 ప్రో 5జీ, నోట్ 13 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటిలో 6.67 ఇంచుల హెచ్‌డీ అమోలెడ్ స్కీన్, 16 ఎంపీల సెల్ఫీ కెమెరా ఉన్నాయి. నోట్ 13 ప్రో+ 5జీలో మీడియాటెక్ డైమన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌ను, 200 ఎంపీ ప్రైమరీ కెమెరాను అమర్చారు. రెడ్‌మీ నోట్ 13 5జీ ధర రూ.18 వేలు (6జీబీ+128జీబీ), నోట్ 13 ప్రో 5జీ (8జీబీ+128జీబీ) రూ. 26 వేలు. నోట్ 13 ప్రో+ 5జీ ధర రూ.32 వేలు (8జీబీ+256 జీబీ).