2023 మార్చిలో రెండు స్మార్ట్ ఫోన్లు Redmi Note 12 Pro 5G మరియు Redmi Note 12 Pro+ 5G లను ఆవిష్కరించిన Xiaomi .. తాజాగా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురానుంది. Redmi Note 13 Pro, Note 13 Pro+ లు త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఇప్పటికే TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించబడ్డాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన స్పెషల్ ఫీచర్లను ఈ వెబ్ సైట్ ఉంచారు.
త్వరలో మార్కెట్ లోకి రానున్న Redmi Note 13 Pro, Note 13 Pro+లలో వరుసగా 5,020mAh , 4,880 mAh బ్యాటరీ, 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుంది. Redmi Note 13 Pro+ 1TB స్టోరేజ్, 18GB RAM , Redmi Note 13 Pro గరిష్టంగా 16GB RAMతో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లలో 200-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 16 మెగా పిక్సల్స్ సెల్పీ కెమెరా ఉంటుంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ TENAA సర్టిఫికేషన్‌ల సైట్‌లో వీటికి సంబంధించిన ఫీచర్లతో స్క్రీన్‌గ్రాబ్‌లను షేర్ చేసింది.