
కడప ఫారెస్ట్ డివిజన్ లోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో 101 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్లేపల్లి సెక్షన్ ఇటుకులపల్లి అటవీ పరిధిలో చందనాల బోరు నుంచి కూంబింగ్ చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి. శ్రీనివాస్ తెలిపారు. ఎర్ర బావి చెరువు వద్ద ఎర్రచందనం దొంగలను రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన మినీ లారీని కనుగొనడంతో. ఆ ప్రాంతాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు. కొంతమంది స్మగ్లర్లు పారిపోగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కడప జిల్లా ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోమి రోలు అంకయ్య (39) గా గుర్తించారు.
ముందస్తు సమాచారం మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఏఎస్పి జె శ్రీనివాస్, ఆర్ ఐ లు చిరంజీవి, సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్ కుమార్ ఆర్ఎస్ఐలు మురళీధర్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఎస్సై రఫీ కూంబింగ్ చేస్తుండగా...కడపజిల్లా అటవీ ప్రాంతంలోని పోరుమామిళ్ల సమీపంలో 101 ఎర్రచందనం దొంగలతోపాటు టాటా గూడ్స్ క్యారియర్, రెండు మోటార్ సైకిలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దొంగలు 2,959 కిలోల బరువు ఉన్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ మొత్తం కోటి రూపాయలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిన ఎస్పీ పి శ్రీనివాస్ రివార్డులతో సత్కరించారు.