Relations : ఒకే ఒక్క హగ్.. ఎమోషన్ తగ్గిస్తుంది.. ఆత్మ విశ్వాసం పెంచుతుంది

దసరా పండుగనాడు.. అయినోళ్లందరికి జమ్మి ఆకు పెట్టి ఓ హగ్ ఇచ్చుకుంట పోతరు. మరి రంజాన్ నాడు కూడా 'భాయ్ భాయ్' అంటూ అయినోళ్లను హగ్ చేసుకుంటరు. అట్ల పండుగ పేరు మీద హగ్ చేసుకుంటూ లోలోపల అంతులేని సంతోషాన్ని ఫీల్ అయితం. 'మనిషి హ్యూమన్ టకి దూరమై సంతోషాన్ని కోల్పోతుండు. కాబట్టి కనీసం పండుగనాడన్న ఒకరినొకరు ముట్టుకోవాలని పెద్దలు అట్ల ఆచారం లెక్క పెట్టిండ్రోమో ! తెల్వదుగానీ, హగ్ వల్ల మస్తు లాభాలున్నయ'ని సైన్స్ కూడా చెప్తోంది. బయటి దేశాల్లో..'హగ్' కామన్! ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసే గ్రేట్ సింబల్, హగ్ కేవలం శృంగారానికి సంబంధించినది కాదని రియలైజ్ కావాల్సిన టైం వచ్చింది. కౌగిలింతే అన్నింటికన్నా అందమైన, అద్భుతమైన కమ్యూనికేషన్ అని మనమంతా తెలుసుకోవాల్సిన టైం వచ్చింది!

అవును! ఈ లోకంలో ఉన్నవాటిలో కౌగిలింతే అన్నింటి కన్నా.. అందమైన కమ్యూనికేషన్, నోటి మాటగా.. 'ఐ లవ్ యూ''ఐ లైట్ యూ" అని చాలామంది. వాళ్ల ఫీలింగ్స్ ని ఎదుటివాళ్లకు ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. మాటలతో ఎన్ని సార్లు 'ఐ లవ్ యూ' అని చెప్పినా... అది ' బెస్ట్ వన్' మాత్రం కాలేదు. అంటే, ఆ ప్రేమని కొన్నిసార్లు చూడలేకపోవచ్చు. అది వాళ్ల మనసుకి చేరే క్రమంలో.. అందులో మీరు కలిపిన ప్రేమ వాళ్లకు కనపడకపోవచ్చు. అలాంటప్పుడు ఎన్నిసార్లు 'ఐ లవ్ యూ' అని చెప్పినా వృథానే! మన ఫీలింగ్స్ ని సైగలతోనూ ఎక్స్ ప్రెస్ చేస్తాం. అయితే, అన్నింటికన్నా. చాలా ఈజీగా చేయగలిగేది. మనల్ని ప్రేమించేవాళ్లను.. హగ్ చేసుకోవడమే. అది సంతోషాన్ని, సంతృప్తిని, గాఢమైన ప్రేమను తెలియజేస్తుంది.

ఇద్దరి మధ్య క్లోజ్ ఫిజికల్ కనెక్షన్ని ఏర్పరుస్తుంది. ఇద్దరికీ కలిపి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని గిఫ్ట్ ఇస్తుంది. ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి, కెరీర్లో ఎదుగుదలకు హగ్స్ చాలా ముఖ్యం అంటారు. థెరపిస్ట్, రచయిత వర్జీనియా సాతిర్ హెల్దీగా, కంఫర్ట్ గా జీవించడానికి హగ్స్ ఎంతో ముఖ్యం అంటారామె. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో స్టడీలు చేశారు. ఏసడి తీసి చూసినా... హగ్స్ మనలో పాజిటివ్ ఎమోషన్స్ ని పెంపొందిస్తాయనే సారాంశమే బయటపడింది. "హగ్ కి అంత సీన్ ఉందా? అంటే ఒకసారి ఈ ఏడు లాభాలపై ఓ లుక్కేస్తే... ఉందనే అంటారు!

ఎమోషనల్ పెయిన్..

అప్తులు చనిపోయినప్పుడు చుట్టాలు, ఫ్రెండ్స్ హగ్ చేసుకొని ఏడుస్తుంటారు. హగ్ బాధని తగ్గిస్తుంది. నిరాశగా ఉన్నప్పుడు, డిప్రెషన్ బాధపడుతున్నప్పుడు, ఎవరైనా చనిపోయి.. దుఃఖంలో మునిగిపోయినప్పుడు కలిగే ఎమోషనల్ పెయిన్ని తగ్గించేది.. ఆ బాధ నుంచి బయటపడేసే శక్తి కేవలం మీ ఆత్మీయుల హగ్ కే ఉంది. హగ్ మూడ్ ని, మనసుని రిలాక్స్ చేయగలదు. ఎమెషన్ని బ్యాలెన్స్ చేయగలదు. మీరు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడు హగ్ లు లేకుంటే... దాని నుంచి బయటపడలేదు.

ఓవరాల్ హెల్త్ కి... 

'రోజూ హగ్ చేసుకుంటే.. ప్రైస్ లెవల్స్ తగ్గి రోగ నిరోధక వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. రోజూ హగ్ చేసుకునే వాళ్లలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అంటే వాళ్లు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఈ ఆశ్చర్యకరమైన విషయాలన్నీ 2014లో లండన్ సైంటిస్టులు చేసిన ఒక స్టడీలో తేలింది. రోగ నిరోధక వ్యవస్థ వీక్ గా ఉండటమే అన్ని రోగాలకు కారణం. కాబట్టి ఓవరాల్ హెల్త్ కి హగ్ ఎంతో ముఖ్యమో అర్థమైంది కదూ! 

స్ట్రెస్ తగ్గిస్తుంది..

మానసిక ఆరోగ్యంపై కూడా హగ్స్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. హగ్ చేసుకున్నప్పుడు కార్టిసోల్ లెవల్స్ తగ్గుతాయి. అప్పుడు మీరు రిలాక్స్ స్టేజికి వచ్చేస్తారు. హగ్ చేసుకుంటే.. లోలోపల ఉండే భయం కూడా పారిపోతుంది. మూడ్నే సెట్ చేస్తుంది. ఒత్తిడిని ఓడించాలంటే ఒక్క చాలు.

చిన్నప్పుడు అమ్మ తన పిల్లల్ని హగ్ చేసుకుంటుంది. అందుకే తల్లి బిడ్డలూ అంత సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పటి కంటే.. హగ్ చేసుకున్నప్పుడే ఎక్కువ సంతృప్తి, సంతోషం కలుగుతుంది. ఇదే తల్లిబిడ్డలకు, పార్ట్ నర్స్ వర్తిస్తుంది. అయితే, హగ్ ని శృంగార సంబంధమైనదిగా భావించడం వల్లనే మన దేశంలో హగ్ చేసుకుంటున్నవాళ్లను వింతగా చూస్తారు.

ఆత్మవిశ్వాసానికి..

అవసరం లేకున్నా. అక్కరకు రాకున్నా కొన్ని విషయాల గురించి పదేపదే ఆలోచిస్తూ యాంగ్జెటీలో చిక్కుకుంటారు కొంతమంది. ఈ యాంగ్జెటీ పేషెంట్లకు కూడా హగ్ ఒక పర్ ఫెక్ట్ పీల్ ! హగ్ చేసుకున్న తర్వాత కచ్చితంగా యాంగ్జెటీ నుంచి బయటపడతారు. హగ్ భయాన్ని తగ్గిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సైంటిస్ట్లు ప్రూవ్ చేశారు. "మానవ సంబంధాల్లో 'టచ్' అనేది చాలా పవర్ఫుల్ మెకానిజమ్. ఒక మనిషి మీతో ఉన్నాడని. టచ్ మాత్రమే చెప్పగలుగుతుంది" అని సైకలాజికల్ సైంటిస్ట్ లు అంటున్నారు. 

అందమైన కమ్యూనికేషన్..

మనం సాధారణంగా ఎవరితోనైనా ఎలా కమ్యూనికేట్ చేస్తాం? ఎక్కువగా మాటలతో, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్, సైగలతో భావాల్ని చేరవేస్తాం. అయితే, టచ్ తో కూడా మెసేజీలు చేరవేసుకుంటారు. ఒకరికొకరు తెలియకపోయినా.. టచ్ చేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నది అవతలి వాళ్లకు చేరుతుంది. వాళ్లు అనుకుంటున్నది వీళ్లకూ చేరుతుంది. ఒక్కో టచ్ ఒక్కో విధమైన ఎమోషన్ని కన్విన్స్ చేస్తుంది. ద్వేషాన్ని, బాధని, అసహ్యాన్ని, ఆశ్చర్యాన్ని, ప్రశంసని, ఆనందాన్ని, దుఃఖాన్ని, కరుణని ఇలా అన్నింటిని ట తెలియజేస్తుంది. అయితే, మన ప్రశంసని, బాధని, సంతోషాన్ని కంఫర్ట్ గా, ఈజీగా ఎక్స్ ప్రెస్ చేయడానికి ఉన్న ఒకే ఒక అందమైన కమ్యూనికేషన్ హగ్ మాత్రమే! 

చక్రాల యాక్టివేషన్..

ఒక్క హగ్ శరీరంలో ఉండే చక్రాలన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది. థైమస్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. ఇది బాడీలో తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ సమర్థవంతంగా పని చేయడంలోనూ 'హగ్ ' హెల్ప్ చేస్తుంది. హగ్ చేసుకోవడం. వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. చర్మం నిగనిగలాడుతుంది. హగ్ చేసుకున్నప్పుడు చర్మంలో విద్యుత్ లాంటిది ప్రవహిస్తుంది. దీన్నే గాల్వనిక్ స్కిన్ డెస్పాన్స్ అంటారు. స్కిన్ కండెక్షన్ తో ప్రవహించే విద్యుత్ వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ మెరుగ్గా పని చేస్తుంది. మనల్ని ఇష్టపడేవాళ్లకు, ప్రేమించేవాళ్లకు ఒక హగ్ ఇస్తే.. మీతో పాటు వాళ్లూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. సో... ఇప్పుడైనా ఒక హగ్ ఇస్తారనుకుంటా!