న్యూఢిల్లీ: హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.2,591 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.2,668 కోట్లతో పోలిస్తే 2.4 శాతం తగ్గింది. హెచ్‌యూఎల్ రెవెన్యూ రూ.2.1 శాతం పెరిగి రూ.16,145 కోట్లకు చేరుకుంది.
కొన్ని ప్రొడక్ట్‌ల ముడిసరుకుల ధరలు పెరగడంతో పాటు డిమాండ్ తగ్గడంతో కంపెనీ ఫ్రాఫిట్ పడింది. అంతేకాకుండా హిందుస్తాన్ యూనిలీవర్ తన పేరెంట్ కంపెనీ యూనిలీవర్ లిమిటెడ్‌కు చెల్లించే రాయల్టీ ఫీజు పెంచడం, యాడ్ ఖర్చులు పెరగడంతో కంపెనీ మార్జిన్స్ పడిపోతాయని ఎనలిస్టులు ముందుగానే అంచనా వేశారు.
ఫేస్ వాల్యూ రూ.1 ఉన్న ఒక్కో షేరుపై రూ.19 ఇంటిరిమ్ డివిడెండ్‌ను, రూ.10 స్పెషల్ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.