మరిపెడ, వెలుగు : నెట్ మేడ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఆఫీస్‌లో దివ్యాంగులకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృత్రిమ అవయవాలు, పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ నవీన్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సింధూర, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, కమిషనర్ రాజు పాల్గొన్నారు.