డోర్నకల్‌‌‌‌లో గెలిచేది నేనే : రెడ్యానాయక్‌‌‌‌

మరిపెడ, వెలుగు : ఎవరెన్ని కుట్రలు చేసినా డోర్నకల్‌‌‌‌లో తన గెలుపుని ఆపలేరని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడలో బుధవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు క్యాండిడేట్‌‌‌‌ను డిసైడ్‌‌‌‌ చేసుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు తెలువని వాళ్లు ఎమ్మెల్యేలు అవుతారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం పొందని కుటుంబమే లేదన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్‌‌‌‌ లైబ్రరీ చైర్మన్‌‌‌‌ గుడిపూడి నవీన్‌‌‌‌రావు, మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ శారద, ఎంపీపీ అరుణ పాల్గొన్నారు.