
ఇంటిని స్లాబ్‌తో నిర్మించిన.. పూరిల్లు అయినా.. రేకుల ఇల్లు అయినా కచ్చితంగా వాస్తు పాటించాలి. ఇంటిని రేకులతో నిర్మించేటప్పుడు రేకుల వాలు వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున ఉండాలి.. అలా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో వాస్తు బ్రహ్మ, జ్యోతిష్య పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారో చూద్దాం..
ప్రశ్న: చిన్న స్థలంలో రెండు రేకుల రూములు వేసుకొని అందులో ఉండేవారు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు .. ఇలా ఒక్కొక్కటిగా ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్లేనని వాస్తు బ్రహ్మ, జ్యోతిష్య పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అలాంటి అంతకుముందు అద్దె ఇంట్లోనే మంచిగా ఉంటారు. దానికి కారణం రేకుల వాలు దక్షిణం వైపునకు ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. ఇంట్లో సంతాన ఉత్పత్తి జరగదు.. మరి పై కప్పు వాలు ఎటువైపు ఉండాలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం సలహాను తెలుసుకుందాం. .
జవాబు : ఇల్లు కట్టేటప్పుడు చేసిన పెద్ద తప్ప రేకుల వాలును దక్షిణం దిక్కుకు పెట్టడమే. సమస్యలకు కారణం వాస్తు దోషం అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇంటి పై కప్పు వాలు ఎప్పుడూ ఉత్తరం, తూర్పు ఈశాన్యం దిక్కులోనే ఉండాలి. అలాకాకుండా మరి ఏవైపునకు ఉన్నా మంచిది కాదు. అది రేకుల ఇల్లైనా, బంగ్లా అయినా... ఈశాన్యం మూల గోడ .... మిగతా గోడల కంటే తక్కువ ఎత్తులో ఉండాలి. అలా వీలు కాకపోతే సమానంగానైనా ఉండాలి. అలాగే నైరుతి మూల గోడ ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మీ సమస్యలు దూరం కావాలంటే వాలు సరైన దిక్కుల్లోకి మార్చాలి.
–వెలుగు,లైఫ్–