రీజా హెండ్రిక్స్‌‌ సెంచరీ..పాకిస్తాన్‌‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం

రీజా హెండ్రిక్స్‌‌ సెంచరీ..పాకిస్తాన్‌‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం

సెంచూరియన్‌‌ (సౌతాఫ్రికా) : రీజా హెండ్రిక్స్‌‌ (63 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 117) కెరీర్‌‌‌‌లో తొలి సెంచరీతో విజృంభించడంతో పాకిస్తాన్‌‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌‌లో భారీ టార్గెట్‌‌ను అలవోకగా ఛేజ్ చేసి మరో టీ20 మిగిలుండగానే 2–0తో సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌‌కు వచ్చిన పాక్ నిర్ణీత 20 ఓవర్లో 206/5 స్కోరు చేసింది.

ఓపెనర్‌‌‌‌ సైమ్ ఆయుబ్‌‌ (57 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్‌‌) సత్తా చాటాడు. గలీమ్‌‌, బార్ట్‌‌మన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం సౌతాఫ్రికా 19.3 ఓవర్లలో 210/3 స్కోరు చేసి గెలిచింది. హెండ్రిక్స్‌‌కు తోడు డసెన్ (66 నాటౌట్‌‌) రాణించాడు. హెండ్రిక్స్‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.