- అర్హులకే సర్కార్ పథకాలు అందిస్తం
- క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నయ్
- ప్రజల సొమ్మును జాగ్రత్తగా పంచుతం
- వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
హైదరాబాద్: ప్రజల సొమ్మును జాగ్రత్తగా పంచి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అర్హులకే సర్కార్ పథకాలు అందిస్తామని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నాయని, అక్రమార్కులపై ఫోకస్చేసిందని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు పదే పదే విమర్శలు చేయొద్దని సూచించారు. రుణమాఫీ జరగకపోతే ఎవర్ని సంప్రదించాలో జీవోలో వివరాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 6 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని, అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
రైతు భరోసా విషయంలో తాము ఎప్పుడు మాయ మాటలు చెప్పలేదన్నారు. త్వరలోనే ధరణిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్రైట్స్) చట్టంపై ఇప్పటికే చాలా మంది మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సలహాలు సేకరించామని.. త్వరలో ప్రజాభిప్రాయాలను తీసుకుంటామని పేర్కొన్నారు.
ALSO READ | కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆర్థిక సంక్షోభం: రాకేశ్ రెడ్డి