న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కో–ఆపరేటివ్ సొసైటీల చిన్న డిపాజిటర్ల వాపసు మొత్తాలపై ప్రభుత్వం మునుపటి పరిమితి రూ.10 వేల నుంచి రూ. 50వేల వరకు పెంచింది. సీఆర్సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్ ద్వారా సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.370 కోట్లను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తామని సంబంధిత అధికారి తెలిపారు.
గత వారం చిన్న డిపాజిటర్లకు వాపసు మొత్తంపై పరిమితిని రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచినట్లు అధికారి తెలిపారు. రీఫండ్‌ను విడుదల చేసే ముందు ప్రభుత్వం డిపాజిటర్ల క్లెయిమ్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తోందని అన్నారు.