అరవయ్యేళ్లలో చేయని అభివృద్ధి తొమ్మిదేళ్లలోనే..

పాల్వంచ రూరల్, వెలుగు: రాష్ట్రంలో అరవై ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్​అన్ని రంగాల్లో చేసి చూపించారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం మండలంలోని తోగ్గూడెంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆయనతోపాటు కలెక్టర్​ అనుదీప్​ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తున్నా విమర్శించడం తగదన్నారు. మిషన్​భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత సీఎందేనన్నారు. అనంతరం కలెక్టర్​అనుదీప్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా దాహార్తిని తీర్చినట్లు పేర్కొన్నారు. అంతకు ముందు తోగ్గూడెంలో మిషన్​ భగీరథ నీటిశుద్ది కేంద్రాన్ని వారు పరిశీలించారు.  ప్రోగ్రాంలో జడ్పీ వైస్ చైర్మన్​కంచర్ల చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్​ దిండిగల రాజేందర్, జడ్పీటీసీ వాసుదేవరావు పాల్గొన్నారు.

మన్యంలో మంచినీళ్ల పండుగ..

భద్రాచలం: మిషన్​భగీరథ ఆఫీసర్లు పట్టణంలో ఆదివారం ర్యాలీ తీశారు. పాండువుల గుట్ట నీటి నిల్వ శుద్ధి కేంద్రం వద్ద నిర్వహించిన గ్రామసభలో మిషన్​భగీరథ, బోరు నీరు మధ్య ఉన్న తేడాను వివరించారు. మిషన్​భగీరథలో పని చేసే కార్మికులను సన్మానించారు. స్పెషల్ ఆఫీసర్​నాగలక్ష్మి, మిషన్​భగీరథ ఈఈ శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు 
పాల్గొన్నారు.