ఇచ్చిన టార్గెట్ రీచ్‌‌‌‌ కావాలి : కలెక్టర్ వెంకట్‌‌‌‌ రావు

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన టార్గెట్‌‌‌‌ చేరుకోవాలని కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, వెంకట్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ ఆర్థిక సాయం కోసం 23, 374 మంది దరఖాస్తు చెసుకోగా 17, 985 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.  రెండో విడత గొర్రెల పంపిణీ 3,317 మంది డీడీలు చెల్లించగా.. 137 మందికి గొర్రెలు అందించామని వివరించారు. దళిత బంధు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.

ఈ పథకం పర్యవేక్షణ కోసం నియోజకవర్గాల వారీగా స్పెషల్‌‌‌‌ ఆఫీసర్లను నియమించి, మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఇరిగేషన్ భూముల్లో ఏర్పాటు చేసిన సంపద వనాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని సూచించారు.  అనంతరం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, మెగా పల్లె ప్రకృతి వనాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సురేశ్, డీఆర్డీవో కిరణ్ కుమార్, డీపీవో యాదయ్య, డిప్యూటీ డీఆర్డీవో పెంటయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.