![రిలీజ్‌కు రెడీ](https://static.v6velugu.com/uploads/2023/08/Regina-Cassandra-is-playing-the-lead-role-in-the-movie-'Nenena'_ruaDFoLUvY.jpg)
రెజీనా కసాండ్రా లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘నేనేనా’. కార్తీక్ రాజు దర్శకుడు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. ఆగస్టు 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తమిళంలో ‘సూర్పనగై’ టైటిల్‌తో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. 1920, ప్రస్తుత కాలం.. - రెండు విభిన్న కాలాల నేపథ్యంలో రూపొందిన ఫాంటసీ- అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది.
రెజీనా పురావస్తు శాస్త్రవేత్త పాత్రను పోషిస్తుంది. ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికితీసే సమయంలో మిస్టీరియస్ సంఘటనలకు దారి తీస్తుంది. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, అక్షర గౌడ, అలీ ఖాన్, జయప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.