హనుమకొండ/ హనుమకొండ సిటీ, వెలుగు: హంటర్ రోడ్డు జూపార్క్ సమీపంలోని రీజినల్ సైన్స్ సెంటర్ ను డెవలప్ చేసేందుకు తగిన ప్రపోజల్స్ రెడీ చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను గురువారం వారు సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ సెల్ భవనంతోపాటు ఆడిటోరియం, ఇన్నోవేషన్ హబ్, ల్యాబ్, సైన్స్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రిపేర్లు, ఇతర వనరుల కల్పన కోసం రూ.4 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏకైక రీజినల్ సైన్స్ సెంటర్ ఇదేనని, పనులు జనవరిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారివెంట రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి మెంబర్ సెక్రెటరీ డాక్టర్ సుంకె రాజేంద్రప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ మారుపాక నగేశ్, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లో గ్రేటర్వరంగల్మున్సిపల్కమిషనర్అశ్విని తానాజీవాకడేతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమనిర్మాణాలపై యాక్షన్ తీసుకునేందుకు రెడీగా ఉండాలని ఆదేశించారు.