యాదాద్రి, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం వచ్చే నెల 6లోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, డీటీలను నిర్వహించిన ఎన్నికల శిక్షణలో ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసినందున వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలోనే జరగనుందన్నారు.
ఎపిక్ కార్డు ఉంటేనే ఓటు హక్కు నమోదు అవుతుందని, ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. 24 నుంచి మార్చి 14 వరకు మార్పులు, చేర్పులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు.