ఎల్బీనగర్, వెలుగు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన బౌన్సర్‌పై కేసు నమోదైంది. సిటీకి చెందిన యువతి నాగోల్‌లోని ఓ హోటల్లో 2022లో సీనియర్ కెప్టెన్(రిసెప్షనిస్ట్)గా పనిచేసేది. అదే హోటల్లో అల్వాల్‌కు చెందిన ఎం.సాయికుమార్ (26) బౌన్సర్‌గా పనిచేశాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెకు ప్రపోజ్ చేశాడు.
తొలుత ప్రేమను నిరాకరించిన యువతి.. పదేపదే ఒత్తిడి చేయడంతో అంగీకరించింది. ఆ తర్వాత బాధితురాలిని ఓయో గదికి తీసుకెళ్లి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడి 2024 ఏప్రిల్‌లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడంతో యువతి ప్రశ్నించగా, ఆమెపై దాడి చేశాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు ఎల్బీనగర్ ఠాణాలో గురువారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.