నాన్ బోర్డర్స్ వెంటనే హాస్టల్ ఖాళీ చేసి వెళ్లండి : కేయూ రిజిస్ట్రార్ ఆదేశాలు

వరంగల్ : కాకతీయ యూనివర్శిటీలోని వివేకానంద రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ లో ఉంటున్న నాన్ బోర్డర్స్ వెంటనే ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ టి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్డీ కేటగిరీ 2 అడ్మిషన్లు చేపట్టిన నేపథ్యంలో కొత్త స్టూడెంట్స్ కు  వసతి కల్పించేందుకు హాస్టల్ ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా హాస్టల్ లో ఉంటున్న నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయించేందుకు సహకరించాలని కేయూ పోలీసులకు రిజిస్ట్రార్ టి. శ్రీనివాసరావు లేఖ రాశారు.

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పమైన విషయం తెలిసిందే.