
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ఆశిస్తున్న కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదైంది. రాబోయే ఎన్నికల్లో తనకు ఓటువేసి గెలిపించాలని శుక్రవారం రాత్రి ఆయన మహిళలకు కుక్కర్లు పంపిణీ చేస్తుండగా ఓ వ్యక్తి ఎలక్షన్కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పోలీసులు స్పాట్‌కు చేరుకొని శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కుక్కర్లను సీజ్ చేశారు. అలాగే, అతనిపై 171ఈ, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.