హైదరాబాద్, వెలుగు: సిటీలో జాతి కుక్కుల పేరిట దందా జోరుగా సాగుతోంది. వీరికి పెట్ ఫుడ్ నిర్వాహకులు, కొందరు వెటర్నరీ డాక్టర్లు సహకరిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ బిజినెస్ భారీగా పెరిగింది. ఒక్కో కుక్క పిల్లను వేలల్లో అమ్ముతున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా అమ్మే వారికి చెక్‌పెట్టేందుకు యానిమల్వెల్ఫేర్బోర్డు, బల్దియా చర్యలకు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు పర్మిషన్లు తీసుకోని పెట్ షాపులు, డాగ్ బ్రీడర్స్(కుక్కల పెంపకం దారులు, అమ్మకం దారులు) యానిమల్ వెల్ఫేర్‌బోర్డు వద్ద తప్పనిసరిగా రిజిస్ర్టేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఉంటేనే బల్దియా వెటర్నరీ అధికారులు షాపులకు లైసెన్స్‌లు ఇస్తారు. ఇప్పటికే గ్రేటర్లో 82 పెట్ షాపులకు, 9 డాగ్ బ్రీడర్స్‌కు బల్దియా నోటీసులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా యానిమల్ వెల్ఫేర్‌బోర్డు లైసెన్స్‌లు పొందని షాపులను సీజ్ చేయనుంది. సిటీలో కొందరు అనుమతులు లేకుండానే జంతువులు, పక్షులను అమ్ముతున్నట్లు కొందరు పెట్షాప్స్, డాగ్బ్రీడర్స్ నిర్వాహకులు ఆయా డిపార్ట్మెంట్ల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు కంప్లయింట్ చేయడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే యానిమల్వెల్ఫేర్బోర్డు పర్మిషన్తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టారు.
రెండు శాఖల తనిఖీలు
పెట్షాపులు, డాగ్బ్రీడర్స్సెంటర్లలో బల్దియా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. జంతువులు, పక్షులను రూల్స్ ప్రకారం పెంచుతున్నారా? లేదా? ఎలాంటి వాటిని అమ్ముతున్నారో చెక్ చేస్తున్నారు. రాత్రిపూట జంతువులు, పక్షులకు కావాల్సిన లైటింగ్ ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. ఇప్పటి వరకు77 పెట్ షాపు, 8 డాగ్బ్రీడర్స్నిర్వాహకులు రిజిస్ట్రేషన్లకు అప్లయ్ చేసుకున్నారు. మరోవైపు యానిమల్వెల్ఫేర్బోర్డు అధికారులు సమాచారం ఇవ్వకుండానే వెళ్లి షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్నీ కరెక్ట్‌గా ఉన్న షాపులకు క్లియరెన్స్ ఇస్తున్నారు.
నెలాఖరు లోపు లెసెన్స్‌లు పొందాలె
ఈ నెలాఖరు లోపు అన్ని పెట్ షాపులు, డాగ్బ్రీడర్స్ నిర్వాహకులు బల్దియా వద్ద లైసెన్స్‌లు పొందాల్సి ఉంది. లేకుంటే షాపులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ తీసుకునే ముందు యానిమల్ వెల్ఫేర్బోర్డులో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి లేదా అప్లయ్ అయినా చేసుకొని ఉండాలి.