గుడ్ న్యూస్ : కాంట్రాక్ట్​ ఉద్యోగులకూ ఇక రెగ్యులర్​గా జీతాలు

గుడ్ న్యూస్ :  కాంట్రాక్ట్​ ఉద్యోగులకూ ఇక రెగ్యులర్​గా జీతాలు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో వేతనాల కోసం నూతన విధానం
  • 92 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి లబ్ధి 
  • ప్రతి నెలా రూ.117 కోట్ల బడ్జెట్ అవసరం..  
  • మంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖకు చేరిన ఫైల్ 
  • ఆమోదం లభిస్తే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు

హైదరాబాద్, వెలుగు:  పంచాయతీరాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులు, సిబ్బందికి ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రెగ్యులర్​గా జీతాలు అందనున్నాయి. ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. 

పీఆర్, ఆర్ డీ శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు.? వారికి వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని సూచించారు. వారికి నెలనెలా జీతాలు అందేలా నూతన విధానం తీసుకురావాలని ఆదేశించడంతో.. అధికారులు ఆ దిశగా కసరత్తు చేశారు. ఉద్యోగుల లిస్ట్ ను సిద్ధం చేసి ఫైల్​ను  ఆర్థిక శాఖకు పంపించారు.  ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే ఉద్యోగులు, సిబ్బందికి నెలనెలా వేతనాలు అందనున్నాయి. 

92 వేల మందికి లబ్ధి 

పంచాయ‌‌‌‌‌‌‌‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌‌‌‌‌‌‌‌, సెర్ప్​ ఉపాధి హామీ పథకంలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో వేలాది మంది పనిచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్, ఈజీఎంఎం, ఎస్ ఆర్ డీఎస్, సీఆర్ డీ, ఎస్ బీఎం, సోషల్ ఆడిట్, స్వచ్ఛ భారత్ మిషన్ , మిషన్ భగీరథ, పీఆర్ ఇంజినీరింగ్, తదితర విభాగాల్లో  హెచ్​ఆర్ మేనేజర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ స్టాఫ్,  సెర్ప్​, వీఏవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు గా వివిధ హోదాల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 15 నుంచి 20 విభాగాల్లో దాదాపుగా 92 వేల మంది ఉద్యోగులు ఉంటారు. 

వీరికి ప్రతినెలా వేతనాల రూపంలో రూ.117 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ కేటాయింపుల‌‌‌‌‌‌‌‌ప్పుడే వీరి జీతాల‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది.  కాగా, వివిధ పథకాల అమ‌‌‌‌‌‌‌‌లు, జీతాలు ఒకే ఖాతా కింద నిర్వహిస్తుండడంతో అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాన్ని బ‌‌‌‌‌‌‌‌ట్టి నిధులు మళ్లిస్తున్నారు. దీంతో జీతాలు చెల్లింపునకు సమస్యలు ఎదురవుతున్నాయి.  ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పథకాల అమ‌‌‌‌‌‌‌‌లు, జీతాల‌‌‌‌‌‌‌‌ కోసం వేర్వేరుగా బ‌‌‌‌‌‌‌‌డ్జెట్ కేటాయింపులు చేయాల‌‌‌‌‌‌‌‌ని నిర్ణయించినట్టు తెలిసింది.

దీంతోపాటు క్షేత్ర స్థాయిలో మాన్యువ‌‌‌‌‌‌‌‌ల్ గా చెల్లింపుల ప్రక్రియ కాకుండా ఆన్ లైన్ లో ఏక‌‌‌‌‌‌‌‌కాలంలో  సిబ్బందికి చెల్లింపులు జ‌‌‌‌‌‌‌‌రిగేలా పీఆర్, ఆర్డీ శాఖలు నూతన విధానాన్ని అవ‌‌‌‌‌‌‌‌లంభించనున్నాయి.  దీంతో ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే  ప్రతినెలా  మొద‌‌‌‌‌‌‌‌టి తారీఖునే వీరికి జీతాలు అందే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నది. దీనికి ఆర్థిక శాఖ, ప్రభుత్వం ఆమోదం ముద్ర వేస్తే  వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి.