మొదలైన ‘కీడా కోలా’ మూవీ రెగ్యులర్ షూటింగ్

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న తరుణ్ భాస్కర్, కొన్ని సినిమాలకు రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బిజీ అయ్యాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు తరుణ్. ‘కీడా కోలా’ అనే వెరైటీ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా రూపొందిస్తున్నాడు. శుక్రవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. 

కూల్ డ్రింక్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద బొద్దింకను చూపిస్తూ డిఫరెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమాని అనౌన్స్ చేసిన టీమ్.. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. కాంట్రవర్సీ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కామెడీ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.  ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు మాత్రం ప్రకటించారు. వీజీ సైన్మా, క్విక్ ఫాక్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.