
హనుమకొండ, వెలుగు: మెరుగైన, నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. హనుమకొండ నక్కలగుట్ట విద్యుత్ భవన్ లో సోమవారం సంస్థ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించి మాట్లాడారు.
లోడ్ పెరిగే చాన్స్ ఉన్న ఏరియాల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే నెలలో పంట కోతలు పూర్తవుతాయని, ఆ తర్వాత వ్యవసాయ సర్వీసులను త్వరితగతిన రిలీజ్చేయాలని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్ చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్ ఉన్నారు.