- ఇంటి ఫొటోలు, కనీసం నంబర్లు కూడా లేకుండానే అప్రూవల్
సూర్యాపేట, వెలుగు : రూల్స్ పక్కన పెట్టి జీవో నంబర్ 58, 59 కింద సూర్యాపేట కుడకుడ సర్వే నంబర్ 126 లో బీఆర్ఎస్లీడర్లకు చేసిన అక్రమ రెగ్యులరైజేషన్ వ్యవహారం ఇప్పుడు ఆఫీసర్ల మెడకు చుట్టుకుంటోంది. కలెక్టర్ఆదేశాలతో సూర్యాపేట ఆర్డీవో నేతృత్వంలో ఇప్పటికే మొదలైన విచారణ కొనసాగుతోంది. గురువారం సర్వే నంబర్126కు వెళ్లిన అధికారులు ఎంక్వైరీ చేశారు.
జీవో 58, 59 ప్రకారం రెగ్యులరైజ్చేయాలంటే కొన్ని రూల్స్పాటించాలి. వివాదాలు లేని ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో ఇండ్లు కట్టుకుంటే కరెంట్ బిల్, పన్ను, ఇంటి నంబర్ తోపాటు ఇంటి ముందు ఫొటో దిగి దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక తహసీల్దార్ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఆన్ లైన్ ద్వారా అప్రూవల్ చేయడం లేదా రిజెక్ట్ చేస్తారు.
కానీ బీఆర్ఎస్ లీడర్లకు లబ్ధిచేకూర్చేందుకు అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్విజిట్చేయకుండానే రెగ్యులరైజ్చేశారు. చివ్వెంల మండలంలో ఒకరికి ఎలాంటి ఇల్లు లేకపోయినా అతడి పేరుపై రెండు, బంధువుల పేరుపై నాలుగు స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. అక్రమార్కుల్లో ఈయనే కాకుండా ప్రభుత్వ టీచర్, రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శులు కూడా ఉన్నట్టు తేలింది. మరో రెండు రోజులపాటు విచారణ కొనసాగుతుందని, ఇందులో సంబంధం ఉన్న అందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.