- = గత సర్కారు ఇచ్చిన జీవో 16 రాజ్యాంగ విరుద్ధం
- = కీలక తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
- = ఇకపై రెగ్యులరైజేషన్ ఉండదని స్పష్టీకరణ
- = ఇప్పటికే సర్వీసులు క్రమబద్ధీకరించబడిన వారికి నో ప్రాబ్లం
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16ను హైకోర్టు కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యశాఖల్లో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించింది. అయితే ఇప్పటి వరకు రెగ్యులరైజ్ అయిన వారికి ఇది వర్తించదని తెలిపింది. హైకోర్టు తీర్పు ప్రకారం కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు అవకాశం ఉండదు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన వారు పూర్తి స్థాయి ఉద్యోగులుగానే పరిగణింపడతారు.
ALSO READ | వరంగల్ గడ్డపై మాటిస్తున్నా.. రైతు రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన