- సీఎంవో నుంచి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలో రెగ్యులరైజ్చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అర్హత గల కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలని ఆదేశించినట్లు సమాచారం.
కాంట్రాక్టు ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్‌పై 2016 ఫిబ్రవరి 26న ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీనిపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యర్ధి ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20న తీర్పును వెలువరించింది. దీంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగినట్లయింది.