మాదిగల మద్దతు వంశీకృష్ణకే.. : రేగుంట సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాదిగ

మాదిగల మద్దతు వంశీకృష్ణకే.. : రేగుంట సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాదిగ

మంథని టౌన్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మాదిగలం మద్దతు గడ్డం వంశీకృష్ణకే ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాదిగ, నియోజకవర్గ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోకల మల్లేశ్ మాదిగ తెలిపారు. సోమవారం మంథని ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలను మోసం చేసిందన్నారు.

మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పిలుపుతో మాదిగల మద్దతు వంశీకృష్ణకే ఉంటుందని తెలిపారు. విశాక ట్రస్ట్ ద్వారా కాకా కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్లూరి శ్రీనివాస్ మాదిగ, జిల్లా కన్వీనర్ కుమారస్వామి మాదిగ, లీడర్లు కర్ణకృష్ణ, సాంబయ్య, లింగయ్య, బానేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశ్వరరావు, జంపన్న, లింగయ్య  పాల్గొన్నారు.