భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ జట్టు నుంచి వైదొలిగాడు. రాంచీలోని JCA క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతున్న నాల్గవ టెస్టుకు అహ్మద్ స్థానంలో రూకీ స్పిన్నర్ ను ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) రెహాన్ అహ్మద్ వ్యక్తిగత కారణాల కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చాడని.. ధర్మశాలలో జరగనున్న చివరిదైన ఐదో టెస్టుకు దూరమవుతాడని X (ట్విట్టర్) ద్వారా ప్రకటనను విడుదల చేసింది.
భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అహ్మద్ హైదరాబాద్, వైజాగ్, రాజ్‌కోట్‌లలో జరిగిన తొలి మూడు మ్యాచ్‌లు ఆడాడు. మూడు టెస్టుల్లో 11 వికెట్లు తీయడంతో బ్యాటింగ్ లో 76 పరుగులు చేశాడు. రెండో టెస్ట్ తర్వాత ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు లేకపోవడంతో ఇంగ్లాండ్ కు భారీ దెబ్బ తగలనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సీరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ తొలి సెషన్ లోనే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి సెషన్ ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్ లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(0) రూట్ (16) ఉన్నారు. భారత్ బౌలర్లలో ఆకాష్ దీప్ కు మూడు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
Take care, @RehanAhmed__16 ❤️
— England Cricket (@englandcricket) February 23, 2024
Rehan Ahmed will return home for personal reasons.
He will not be returning to India and we will not be naming a replacement.
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket pic.twitter.com/T7SgSLYDhp