సూళ్లూరుపేట: చంద్రయాన్-2 ప్రయోగానికి రిహార్సల్ ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదిన నిర్వహించనున్నఈ ప్రయోగానికి సంబంధించి ఫుల్‌డ్రస్ రిహార్సల్ (ఎప్‌డీఆర్ 1) ప్రారంభించి కొనసాగిస్తున్నట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను జీరో పాయింట్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రిహార్సల్ నిర్వహిస్తున్నారు. ప్రయోగానికి జరిగే ప్రక్రియను కంప్యూటర్‌ల ద్వారా వీక్షిస్తున్నారు. ఈ రిహార్సల్ పూర్తి తర్వాత లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
తదుపరి కౌంట్‌డౌన్ ప్రారంభించి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు ఇస్రో ఈ రాకెట్ ను నింగిలోకిక పంపించనుంది. చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టే ఈ చంద్రయాన్-2 ద్వారా వాటి ఉపగ్రహాలైన ఆర్బిటర్, లాండర్, రోవర్‌ను కక్ష్యలోకి పంపనున్నారు.