రీయింబర్స్ మెంట్ బకాయిలు త్వరలో చెల్లిస్తం: డిప్యూటీ సీఎం భట్టి

రీయింబర్స్ మెంట్ బకాయిలు త్వరలో చెల్లిస్తం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇంజినీరింగ్, టెక్నికల్ కాలేజీల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సాయంత్రం సెక్రటేరియెట్ లో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో  డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు.