‘జడ్జి’ల భర్తీ.. వాయిదాలపై వాయిదాలు

‘జడ్జి’ల భర్తీ.. వాయిదాలపై వాయిదాలు

reiterated recommendations for the appointment of judgesవెలుగు, ఓపెన్ పేజ్: హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు కొలీజియం కొంతమందిని కేంద్ర లా మినిస్ట్రీకి రికమండ్ చేస్తుంది. వాళ్ల వివరాలను అప్పటికే హైకోర్టు కొలీజియం, కేంద్రం ఒకసారి పరిశీలించి ఉంటాయి. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆ అభ్యర్థుల ప్రొఫైల్స్ ని ‘యూనియన్ లా మినిస్ట్రీ’ మరోసారి ఎగ్జామిన్ చేసి పునఃపరిశీలనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు కొలీజియానికి పంపుతుంది. సుప్రీం కొలీజియం ఆ రికమండేషన్లను ఏకగ్రీవంగా ఓకే చేస్తే (రీఇటరేట్ చేస్తే) వాటిని ఫైనల్ చేయాల్సిన బాధ్యత ఇక కేంద్రానిదే. రీఇటరేటెడ్ (పునఃపరిశీలన) రికమండేషన్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. నిర్ణయాన్ని అకారణంగా వాయిదా వేస్తే కుదరదు. అది ‘చట్టవిరుద్ధం’ కిందికి వస్తుంది. అయితే, ఇలాంటివి ఏకంగా 9 రీఇటరేషన్లు కేంద్రం వద్ద ‘టూ మచ్ డిలే’ అవుతున్నట్లు ఆ వివరాలను చూస్తే అర్థమవుతోంది. రీఇటరేటెడ్ రికమండేషన్లను నోటిఫై చేసే విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని, తద్వారా తనకు అనుకూలమైన జడ్జిలను ఎంచుకోవటానికి దారి చూసుకుంటోందనే అభిప్రాయం నెలకొంది.

అపాయింట్మెంట్ల విషయంలోనే కాదు. ట్రాన్స్ ఫర్ల లోనూ సర్కారు ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతోంది. సుప్రీం కొలీజియం రీఇటరేట్ చేసిన రికమండేషన్ పై యాక్షన్ తీసుకోకుండా లేట్ చేస్తే కొలీజియంలోని కొందరు జడ్జిలు రిటైరైపోతారు. ఈ ఖాళీలను భర్తీ చేయాలంటే మళ్లీ కొత్త కొలీజియం ఏర్పడాలి. గతంలో రీఇటరేట్ చేసి పంపిన రికమండేషన్లను కూడా కొత్త కొలీజియం రీకాల్ చేస్తుందేమోనని కేంద్రం ఆశిస్తున్నట్లు భావించవచ్చు. కొత్త పేర్లు వస్తాయని ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తోంది.

వ్యవస్థ ఇలా ఉంటే జనం ప్రశ్నించకుండా ఎలా ఉంటారు?

సుప్రీం కోర్టు కొలీజియం రికమండ్ చేసిన జడ్జిలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మోడీ గవర్నమెంట్ కాలయాపన చేయడంపై సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రస్ట్​ లిటిగేషన్ (సీపీఐఎల్ ) పిటిషన్ వేసింది. తొమ్మిది రీఇటరేషన్లను ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని పిటీషనర్‌‌‌‌ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ ఆరు వారాల వరకు వాయిదా వేయటంతో ఆయన కూడా దీన్ని ‘లైట్ ’ తీసుకున్నారా అనిపిస్తోంది.

ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న రికమండేషన్ల సంఖ్య 9 కాదని, 27 అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఇక, కొలీజియం క్లియర్ చేయాల్సిన రికమండేషన్ల సంఖ్య ఏకంగా 70 నుంచి 80 వరకు ఉంటాయని అన్నారు. దీన్ని బట్టి ఇదేమీ పెద్ద విషయం కాదన్నట్లు వ్యవహరించారు. ఇలా మాట్లాడటం ద్వారా సీజేఐ ఇన్ డైరెక్ట్​గా సర్కారుకు సపోర్ట్​ చేసినట్లు, క్లీన్ చిట్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. రికమండేషన్ల విషయాన్ని త్వరగా తేల్చేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి ఆర్డర్ వేయకపోవటంతో జడ్జి పోస్టుల భర్తీ మరింత జాప్యం కానుంది. తద్వారా పెండింగ్‌‌‌‌ కేసుల పరిష్కారం ఇప్పట్లో తేలదు.

వేకెన్సీల వివరాలు ఫిబ్రవరి ఒకటి నాటికి 25 హైకోర్టుల్లో 400 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవేకాక, భర్తీ చేయడానికి ప్రభుత్వం ఓకే చేసిన మొత్తం పోస్టులు 1,079. ఇందులో 771 పర్మినెంట్, 308 అడిషనల్ జడ్జి పోస్టులు. వేకెన్సీల్లోని పర్మినెంట్ పోస్టులు 244. అడిషనల్ జడ్జి పోస్టులు 156. దేశంలోని వివిధ కోర్టుల్లో ఇలా భారీ వేకెన్సీలు ఉంటే, ప్రభుత్వమేమో సుప్రీం కొలీజియం ఇచ్చిన రికమండేషన్ల రీఇటరేట్లను నాన్చుతోంది. ఒకటీ అరా తప్ప మెజారిటీ కేసుల్లో కారణం చెప్పకుండా కాలం గడుపుతోంది. ఈ పద్ధతి మారితే తప్ప పెండింగ్ కేసుల సంఖ్య తగ్గదు.