
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ఎన్నికయ్యారు. బీజేపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా రేఖాగుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 20) న ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ పెద్దలు హాజరుకానున్నారు.
Also Read :- అమెరికాకు కేసీఆర్!..అందుకోసమేనా?
మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు.
#WATCH | BJP MLAs and party leaders congratulate Rekha Gupta as she is set to become the new Chief Minister of Delhi pic.twitter.com/1nzwZdOMdz
— ANI (@ANI) February 19, 2025
ఎవరీ రేఖాగుప్తా?
- రేఖ గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు.
- ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు
- 50 ఏళ్ల రేఖ 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బ్యాంక్ ఉద్యోగి
- రేఖ గుప్తా ఉన్నత విద్యా ఢిల్లీలో. చదువు ఎల్ఎల్బీ.
- చిన్నతనం నుంచే ఆర్ ఎస్ఎస్, ఏబీవీపీలో ఉన్నారు.
- 1995లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో గెలిచి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
- 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి
- 2007 ఉత్తర పితంపుర నుండి కౌన్సిలర్
- 2007: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి రెండు సంవత్సరాలు చైర్‌పర్సన్
- ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు