
Rekha Jhunjhunwala: రిటైల్ మార్కెట్లలో చాలా మంది పెట్టుబడిదారులు పెద్దపెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలను ఎల్లప్పుడూ ఫాలో అవుతూనే ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది దివంగత బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాను ఫాలో అయ్యేవారు. అయితే ప్రస్తుతం వారు రేఖాను అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చి 2025తో ముగిసిన త్రైమాసికంలో ఆమె కెనరా బ్యాంకులో వాటాలను భారీగా పెంచుకున్నట్లు వెల్లడైంది.
వాస్తవానికి గత ఏడాది మార్చి త్రైమాసికంలో రేఖా ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంకులో దాదాపు 37.5 లక్షల షేర్లను కలిగి కొత్తగా కొనుగోలు చేశారు. అయితే మార్చి 2025తో ముగిసిన త్రైమాసికంలో ఆమె భారీగా కంపెనీలో వాటాలను పెంచుకున్నారని తేలింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం ఆమెకు బ్యాంకులో 1.46 శాతం వాటా ఉంది. అంటే 13 కోట్ల 24 లక్షల 43వేల ఈక్విటీ షేర్లను ప్రస్తుతం ఆమె హోల్డ్ చేస్తున్నారని తేలింది. రేఖా పెట్టుబడుల మార్కెట్ విలువ దాదాపు రూ.వెయ్యి 190 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.
ALSO READ : Credit Score: మీకు ఎలాంటి రుణాలు లేవా..? సిబిల్ స్కోర్ పెంచే 5 సులువైన మార్గాలివే..!!
గడచిన శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయం నాటికి కెనరా బ్యాంక్ స్టాక్ ధర ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.90.53 వద్ద ఉంది. ఐదేళ్ల కిందట కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.16 కంటే కిందన ట్రేడింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాతి కాలంలో స్టాక్ ధర ఏకంగా 450 శాతం పెరుగుదలను నమోదు చేసిన సం గతి తెలిసిందే.
బ్రోకరేజీల మాట ఇదే..
* కోటక్ ఇన్ స్ట్రిట్యూషనల్ ఈక్విటీస్ కెనరా బ్యాంక్ షేర్లకు యాడ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.105గా ప్రకటించింది.
* యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.120గా ప్రకటించింది.
* వెంచురా సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.143గా ఫిక్స్ చేసింది.
* జేఎం ఫైనాన్షియల్ కంపెనీ షేర్లు హోల్డ్ రేటింగ్ అందిస్తూ కంపెనీ షేర్లకు రూ.110 టార్గెట్ ధరగా పేర్కొంది.
ఈ షేర్లు అమ్మేసిన రేఖా జున్‌జున్‌వాలా..
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రేఖా స్మాల్ క్యాప్ కంపెనీ బాజార్ స్టైల్ రిటైల్ కంపెనీలో తన వాటాలను తగ్గించుకున్నట్లు వెల్లడైంది. గతంలో కంపెనీలో 3.65 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్న ఆమె ప్రస్తుతం దానిని 3.39 శాతానికి తగ్గించుకోవటం గమనార్హం. అయితే మెుత్తానికి రేఖా దాదాపు 21 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉండగా వాటి విలువ రూ.18వేల 033 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.