జైనూర్, వెలుగు : కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్ నాయక్ సతీమణి రేఖా నాయక్ కోరారు. మంగళవారం జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. డబుల్ బెడ్రూం కంటే ఇందిరమ్మ ఇండ్లు నయం అన్నారు. కాంగ్రెస్‌కు అవకాశమిచ్చి శ్యామ్ నాయక్‌ను గెలిపించాలని, అభివృద్ధి చేసి చూపిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు షేక్ అబ్దుల్ ముఖీద్, ఆత్రం గోవింద్ రావు, లోకేందర్, నాయకులు సుద్దాల శ్రీనివాస్, అశోక్ తదితరులునారు.