తెలంగాణలో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబమే: రేఖానాయక్

జన్నారం, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  సీఎం కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శించారు. శనివారం  మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారందరికి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్, రేఖానాయక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ  బొజ్జు పటేల్ ను గెలిపించాలని కోరారు. సమావేశంలో  కర్ణాటక ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాశ్,    పార్టీ మండల ప్రెసిడెంట్ ఆలీఖాన్,  శంకరయ్య,  రాజశేఖర్, మోహన్ రెడ్డి, సుభాష్​ రెడ్డి, నందునాయక్,  రాజన్న, తదితరులు పాల్గొన్నారు.