ఒక రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తే... పెద్ద కారణమేదీ కనిపించదు. పోనీ పార్ట్ నర్ మీద ప్రేమ తగ్గిందా అంటే అదీలేదు. ఎలాంటి మార్పు ఉండదు. కానీ కలిసి ఉండడానికి మనసు ఒప్పుకోదు. అందుకే అసలింతకీ తప్పెక్కడ జరుగుతుందో కనుక్కుందామని ఇటీవల సైకాలజిస్టులు ఓ అధ్యయనం చేశారు. చిన్న చిన్న ప్రవర్తనలోపాల వల్లే ఇలా జరుగుతోందని ఆ అధ్యయనంలో తేలింది. అవేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.
బిట్టర్ నెస్ : బిట్టర్నెస్ అంటే మనలో ఉండే చేదు. లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉన్న వాళ్లకు ఈ చేదు తెలియకుండా లోపల పెరిగిపోయి, బ్రేకప్‌కి కారణమవుతుంది. బిట్టర్నెస్ అంటే.. మనలో దాచుకున్న కొన్ని భయాలు, కోపాలు లాంటివి. పార్ట్ నర్ మీద ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని అప్పటికప్పుడు చూపించకుండా దాచుకోవడం వల్ల అది తెలియకుండా లోపల నెగెటివ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక టైంలో అది అసహనంలా మారి రిలేషన్‌ని బ్రేక్ చేస్తుంది..
ఇది మనకు తెలియకుండా లోపల జరిగే ఫీలింగ్. దీని నుంచి బయటపడాలంటే... ఒక్కటే మార్గం. వీలైనంత ఓపెన్ గా ఉండాలి. కోపం వస్తే మీ కోపాన్ని చూపించేయాలి. అప్పుడది అక్కడితో పోతుంది. దాచుకోవడం వల్ల అది రోజు రోజుకి పెరిగి ఒకేసారి తుపాన్ లా విరుచుకుపడొచ్చు. అంత దాకా రాకుండా, కోపం చిన్నదైనా పెద్దదైనా ఎప్పటికప్పుడు చూపిస్తేనే బెటర్. మీరు చూపించేది మీ పార్టనర్ మీదే కాబట్టి వాళ్లూ అర్ధంచేసుకుంటారు.
అంచనాలు : రిలేషన్లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది. వాళ్ల ఇష్టాయిష్టాలు, పద్ధతులు అన్నీ తెలుసుకొని ఉంటారు. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనుకుంటారు. అలా ఒకరినొకరు తెలుసుకోవడం బాగుంటుంది. కానీ అలా అని అన్ని విషయాలు తెలుసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే.. మరీ ఎక్కువ తెలుసుకున్న కొద్దీ వాళ్ల గురించి నాకు మొత్తం తెలుసు తనకి ఇది కచ్చితంగా నచ్చదు. అని ప్రతి విషయంలో ఓ అంచనా ఏర్పడుతుంది. ఈ అంచనాలు అంత మంచివి కావు. ఎందుకంటే ఒక్కోసారి మీకు తెలిసింది, తను అనుకుంటుంది వేరుగా ఉండొచ్చు. మీరు మొత్తంగా తన మైండ్ అయితే చదవలేరు కదా. మరెందుకు అంచనాలు వేయడం. అందుకే కొంతవరకైనా ఎవరి పర్సనల్ స్పేస్ లో వాళ్లు ఉండటం మంచిది. ముందే అన్నీ తెలుసుకోవడం, ఆపైఒక అంచనాకు రావడం వల్ల కొత్తదనాన్ని కోల్పోతారు. వెతికేకొద్దీ ప్రతి మనిషిలో ఎంతో కొంత కొత్తదనం కనిపిస్తుంది. దానిని ఎంజాయ్ చేయగలగాలి. అందుకే అంచనాలొద్దు.
సర్ ఫ్రైజ్ ఏది : కొత్తగా ప్రేమలోకి, రిలేషన్లో లోకి ఎంటర్ అయినప్పుడు పార్ట్నర్ కి సడన్ సర్ ఫ్రైజ్ లు ఇస్తుంటారు. ఒకరి నుంచి ఒకరు ఏదో ఒక సందర్భంలో గిఫ్ట్ ఇవ్వడమో, తీసుకోవడమో జరుగుతుంది. కానీ రోజులు గడిచే కొద్దీ మొదట్లో ఉన్నంత ఇంటరెస్ట్ గిఫ్ట్ లు ఇవ్వడంలో ఉండదు. పోను పోను మెల్లగా సర్ ఫ్రైజ్ లు తగ్గుతుంటాయి. దాంతో మీ పార్ట్ నర్ కి మీ మీద ప్రేమ తగ్గిపోయిందనుకుని బాధ పడుతుంటారు. అందుకే అప్పుడప్పుడు మీ పార్ట్ నర్ మీకు ఎంత స్పెషలో తెలిసేలా ఏదో ఒక గిఫ్ట్ లేదా సర్ ఫ్రైజ్ ఇస్తూ ఉండాలి. మీకు నిజంగా మీ పార్ట నర్ పై ప్రేమ తగ్గదు. కానీ ప్రతిసారి ఏం ఇస్తాం అనుకుంటుంటారు. అదే పొరపాటు.సర్ ఫ్రైజ్ అనేది మీరు మీ పార్ట్ నర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని మర్చిపోవద్దు.
తెగే దాకా వద్దు: ఏదైనా చిన్న గొడవైనప్పుడు అది ఎక్కడ మొదలై ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు. మనకు తెలియకుండానే దాన్ని చాలా దూరం సాగదీస్తాం. నిజానికి ఆ గొడవకి అంత సీన్ ఉండదు. మనమే లాగిలాగి తెగేదాకా తెస్తాం. ఇలాంటప్పుడే ఎక్కడో ఓ చోట మొదట్లోనే గొడవని అక్కడితో ముగిస్తే మంచిది. అభిప్రాయాల్లో తేడాలు వచ్చినప్పుడు గొడవలు కాకుండా అభిప్రాయాలను నిజాయితీగా ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా వేటినైనా పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. గొడవ పడుతుంది మీరు మనసిచ్చిన వ్యక్తితో కాబట్టి ఒక మెట్టు తగ్గినా పరవాలేదు.
ఏదో ఒకటి మాట్లాడండి: ఇద్దరూ కలిసి ఉన్నపుడు మధ్యలోకి మౌనాన్ని రానివ్వకూడదు. పరిచయమైన కొత్తలో బాగా మాట్లాడుకొని ఉంటారు. రాను రాను మాట్లాడుకోవడానికి మాటలు దొరక్క కాదు.. కానీ, ఎందుకో రోజూ మాట్లాడే మాటలే కదా అని మాట్లాడ్డం తగ్గిస్తారు. అప్పుడు ఇద్దరి మధ్యా ప్రవేశించిన మౌనం తర్వాత ఎంతదూరం వరకైనా తీసుకెళ్లొచ్చు. ఒక్కోసారి మామూలుగా లేదా ఏదైన చిన్న గొడవైన తర్వాత కూడా చాలా సేపు మాట్లాడకుండా. సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. అలాంటి సందర్భాల్లోనే మీ మధ్య దూరాన్ని మాటలతో నింపేయాలి. రిలేషన్ షిప్లో సైలెన్స్ అంత మంచిది కాదు.
టెస్ట్ పాసవ్వాలి: ఇద్దరి మధ్యా ఉన్న రిలేషన్ ఎప్పుడూ సంతోషకరంగా ఉండాలన్న రూలేమీ లేదు. అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవ్వొచ్చు. అది కూడా మంచికే.. ఇద్దరిమధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో టెస్ట్ చేసుకునేందుకే అలా జరుగుతుంది. మీరు అటెస్ట్ లో తప్పక పాసవ్వాలి ఫెయిల్ అవ్వకూడదు.
ఇక పోతే.. రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో చెప్తారు. అవన్నీ చెప్పడం సులువే కానీ పాటించడమే కష్టం. భరించేవాడికి తెలుస్తుంది నొప్పి అంటుంటారు. కొంతమంది. నిజానికి ఏ రిలేషన్లో బాధ ఉండదు. మనం ఎలా తీసుకుంటే అలా
ఉంటుందంతే.
నేను వద్దే వద్దు: ఇదొక చిన్న చిట్కా. కానీ ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. అదేంటంటే... మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా 'నేను' అనే మాటను వీలైనంత వరకూ తగ్గించాలి. 'నేను'కి బదులు 'మనం' అనే మాటను రీప్లేస్ చేయాలి. ఈ చిన్న చిట్కా మీ రిలేషను చాలా స్ట్రాంగ్ చేయగలదు.' నేను, మనం' అనే మాటలు చిన్నవే అయినా అవి చూపే ప్రభావం మాత్రం చాలా ఎక్కువని గుర్తించాలి
ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలంటే... ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉండాలని అందరూ చెప్పేదే, అందరికీ తెలిసిందే. అయితే ఎంత ప్రేమ ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక టైంలో అన్ని రోజుల నుంచి కాపాడుకున్న రిలేషన్ ఏదో ఒక కారణానికి పుటుక్కుమంటుంది. దీనికి పెద్ద కారణమేమీ ఉండదు. కానీ తెలియకుండానే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అయితే అలా బ్రేక్ చేసే కిల్లర్స్ మనకు కనిపించకుండా మనలోనే ఉంటాయట. వాటినే సైలెంట్ కిల్లర్స్ అంటారు. అందుకే కాస్త జాగ్రత్తగా ఆ కిల్లర్స్ మీద కూడా ఓ కన్నేయాలి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాలి..