
ట్రాన్స్ జెండర్ తో సంబంధం పెట్టుకోవడం యువకుడి జీవితాన్ని విషాదాంతంగా మిగిల్చింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న యువకుడు హిజ్రాతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. అయితే శుక్రవారం (ఏప్రిల్ 11) అనుమానాస్పదంగా మృతి చెందడం జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ(35) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా మృతుడు రామకృష్ణకు గద్వాలకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడిందని బంధువులు చెబుతున్నారు. కొంత కాలంగా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు.
రామకృష్ణ అనుమానాస్పద మృతికి ట్రాన్స్ జండర్ వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.