పెద్దపల్లి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏడు నెలల శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆస్పత్రి ఎదుట సెప్టెంబర్ 12న బంధువులు ఆందోళన దిగారు. వైద్యుడిపై కత్తితో దాడి చేసి ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సిపి శ్రీనివాసులకు వినతి పత్రం అందించారు. వైద్యుడిపై దాడికి నిరసనగా పెద్దపల్లిలో అన్ని ప్రైవేట్ హాస్పటల్ బంద్ కు పిలుపునిచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. వైద్యులపై దాడి చేసిన పాప తండ్రి ఖాదిర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.