- ఆస్తి తగాదాల నేపథ్యంలో మరిది కొడుకు హత్యాయత్నం
- కవర్ సంచుల్లోపెట్రోల్ తెచ్చి పోసిండు
- ఖమ్మం జిల్లా దెందుకూరులో ఘటన
మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరులో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ అంగన్వాడీ టీచర్‌పై ఆమె బంధువు పెట్రోల్‌పోసి నిప్పంటిచాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. అంగన్వాడీ టీచర్గుర్రం అరుణ రోజువారీ విధుల్లో భాగంగా బుధవారం ఉదయం అంగన్వాడీ –1 సెంటర్‌కు వెళ్లింది.
అప్పుడే అక్కడకు వచ్చిన ఆమె మరిది కొడుకు సాయికుమార్ ‘ నీ భర్త వల్ల నా పొలం నాశనమైంది’ అంటూ కవర్ సంచుల్లో తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో గొంతుతో పాటు చేయి కాలిపోయాయి. వెంటనే మధిర ప్రభుత్వ సివిల్దవాఖానకు, అక్కడి నుంచి ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మధిర రూరల్ పోలీసులు తెలిపారు.