ఐబొమ్మ(Ibomm).. ఈ పేరు తెలియని నెటిజన్ ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్ అండ్ ఓటీటీలో రిలీజైన కంటెంట్ ను ఆడియన్స్ కు అందిస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది ఐబొమ్మ. ఏదైనా కొత్త సినిమా ఓటీటీలో వచ్చిందంటే చాలు జనాలందరూ జై ఐబొమ్మ అనే పరిస్థితి వచ్చేసింది. అద్భుతమైన క్వాలిటీ, అది కూడా ఫ్రీ గా ఇస్తుండటంఠీ ఇండియాలో ఈ వాదం బాగా పెరిగిపోయింది.
Also Read :- మట్టి కథ మూవీ రివ్యూ : తెలంగాణ పల్లె జీవితాన్ని ఒడిసి పట్టిన కథ
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్నిరోజులుగా ఐబొమ్మ తన సేవలను ఆపేసింది. మరీ ముఖ్యంగా డౌన్లోడ్ ఆప్షన్ తీసేయడంతో వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. డౌన్లోడ్ అప్షన్ యాడ్ చేయాలంటూ మెసేజెస్ కూడా చేశారు. వారి కోరిక మేరకు ఐబొమ్మ సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు ఐబొమ్మ అంటే గ్రీన్ కలర్ లో ఉండేది. ఇప్పుడు యెల్లో కలర్ లోకి మారిపోయింది. ఈసారి డౌన్లోడ్ అప్షన్ ను కూడా యాడ్ చేశారు నిర్వాహకులు. దీంతో నేటిజన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.