గంగాధర, వెలుగు: గంగాధర మండలం గర్శకుర్తిలో నేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం విరమించారు. 14వ రోజులపాటు నిర్వహించిన చివరిరోజు నేత కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల ప్రకారం తహసీల్దార్‌అనుపమ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నేత కార్మికుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
పద్మశాలీ సేవా సంఘం మండల అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ప్రసాద్, లీడర్లు నర్సయ్య, లచ్చయ్య, రాజమౌళి, కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, రాజేశం, రాజమల్లయ్య పాల్గొన్నారు. అనంతరం మండలంలోని గర్శకుర్తి, గట్టుభూత్కూర్, రామడుగు మండలం మోతె గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు.