భద్రాచలం, వెలుగు : ఐటీడీఏ ఎదుట సోమవారం గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. భద్రాచలాన్ని మూడు పంచాయతీలను చేసే జీవో నంబర్45ను అమలు చేయాలని, దుమ్ముగూడెం మండలం తునికిచెరువు మీదుగా ఆర్లగూడెం, మారాయిగూడెం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేపట్టారు.
రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, నాయకులు వాసం రామకృష్ణ దొర, సున్నం రమేశ్, ముత్తవరపు జానకీరామ్, తుడుందెబ్బ సీనియర్ నాయకులు యాసం రాజు తదితరులు పాల్గొన్నారు.