![ఓజీ మూవీ సెప్టెంబర్ 27న విడుదల](https://static.v6velugu.com/uploads/2024/02/release-date-announced-of-pavan-kalyan-og-movie_iXqpnurzW4.jpg)
ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రస్తుతం రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలేవీ ఈ ఏడాది విడుదలవ్వవు అని ప్రచారం జరిగింది. అయితే మంగళవారం పవన్ ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన వింటేజ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. కారు పక్కన స్టైలిష్‌గా నిల్చొని, చేతిలో టీ గ్లాస్ పట్టుకున్న ఆయన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు .
ALSO READ: ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి రెండో పాట విడుదల
తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ కూడా సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ సాధించడంతో, అదే డేట్‌కు వస్తున్న ‘ఓజీ’ చిత్రానికి కూడా సక్సెస్ సెంటిమెంట్ కలిసొస్తుందని ఖుషీ అవుతున్నారు అభిమానులు.